మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో ఎస్‌టీవో కార్యాలయాన్ని ట్రెజరీ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. తహసీల్ కార్యాలయం పక్కన ఉన్న నిజాంకాలం నాటి ఎస్‌టీవో కార్యాలయం వర్షాలకు ఊరుస్తుండటంతో ఉన్నతాధికారులు నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపట్టారు. ఏడాది పాటు ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగిన ఎస్‌టీవో కార్యాలయం శుక్రవారం సొంత భవనంలోకి మారింది. కార్యక్రమంలో ఎస్‌టీవో అడ్మిన్ సాయిరెడ్డి, తహసీల్దార్ ముజీబ్, ఎస్‌టీవో శివరాజ్, సిబ్బంది పవన్‌కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


