నిజాంసాగర్‌ కెనాల్‌లో వ్యక్తి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

నిజాంసాగర్‌ కెనాల్‌లో వ్యక్తి గల్లంతు

Sep 26 2026 1:08 AM | Updated on Sep 26 2026 1:08 AM

యువకుడి ఆత్మహత్య ఐదుగురిపై కేసు నమోదు నిందితుడి రిమాండ్‌ డీజే సీజ్‌

మోపాల్‌: మండలంలోని న్యాల్‌కల్‌ మాసాని చెరువు సమీపంలోగల నిజాంసాగర్‌ కెనాల్‌లో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన దశరథ్‌ (41) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడు శుక్రవారం స్నానం చేసేందుకు కెనాల్‌లో దిగాడు. ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. స్థానికులు గమ నించి పోలీసులకు సమాచారమిచ్చారు. దశరథ్‌ కోసం ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. రాత్రయినా మృతదేహం లభించలేదు.

వైద్యం వికటించి మహిళ మృతి!

మోపాల్‌: మండలంలోని కాల్‌పోల్‌ తండాకు చెందిన బస్సీ అనవి బాయి (52) వైద్యం వికటించి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అనవి బాయికి ఇటీవల జ్వరం రావడంతో భర్త మోహన్‌తో కలిసి మంచిప్పలోని ఓ ప్రయివేటు వైద్యుడి(ఆర్‌ఎంపీ)ని సంప్రదించారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు సైలెన్‌తోపాటు పలు ఇంజక్షన్లు ఇచ్చాడు. ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆమె పరిస్థితి విషమంగా మారి, స్ఫృహ కోల్పోయింది. వెంటనే ప్రయివేటు వాహనం (ఓమినీ)లో అనవిబాయిని నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించగా, అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మంచిప్పలో వైద్యుడి కారణంగానే అనవిబాయి మృతిచెందిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న సదరు వైద్యుడు అప్పటి నుంచి అందుబాటులో లేడని పేర్కొంటున్నారు. ఆస్పత్రిసైతం మూసి ఉంచినట్లు సమాచారం.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని చిన్నఆత్మకూరు గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని చిన్నఆత్మకూరు గ్రామానికి చెందిన సందిల భానుప్రకాశ్‌(21)కు ఇటీవల వివాహం జరిగింది. గురువారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిను భాను ప్రకాశ్‌ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం గాలించగా గ్రామశివారులోని పొలం వద్ద చిన్న గుడిసె సమీపంలో ఉరేసుకున్న స్థితిలో భానుప్రకాశ్‌ మృతదేహం లభ్యమైంది. కుటుంబ సమస్యల కారణంగా మృతి చెందాడని బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్‌ గౌడ్‌ తెలిపారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన వినాయక నిమజ్జనంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి పోలీసులపై దాడికి యత్నించిన ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్‌ తెలిపారు. దూరిశెట్టి ఉమేష్‌, పెద్దపులి నరేష్‌, నవీన్‌, శెట్పల్లి శివసాయి, పంబల వినోద్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే పొల్కంపేట గ్రామంలో వినాయ నిమజ్జనంలో నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన డీజేను సీజ్‌ చేసినట్లు తెలిపారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జల్దిపల్లి గ్రామానికి చెందిన కల్లు రాజును రిమాండుకు తరలించినట్లు అటవీ శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ భాస్కర్‌ శుక్రవారం తెలిపారు. సదరు నిందితుడు అటవీ భూమిని ఆక్రమించి సాగు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టి ఎల్లారెడ్డి జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఎదుట అతడిని హాజరుపర్చగా 14 రోజుల రిమాండు విధించినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు సారంగాపూర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌బివో భాస్కర్‌రావు, ఎఫ్‌ఎస్‌వో భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): మండలంలోని గిర్నితండా గ్రామ పంచాయతీలో గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రలో శుక్రవారం డీజే పెట్టడంతో మండలి సభ్యులతోపాటు డీజే నిర్వాహకుడిపై కేసు నమోదు చేశామని ఎస్సై శివ కుమార్‌ తెలిపారు. డీజేను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement