కామారెడ్డి అర్బన్: జాతీయ మత్స్యఅభివృద్ధి బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మూడు రోజుల జాతీయస్థాయి వర్క్‌షాప్‌లో కామారెడ్డి ఆ ర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జువాలజీ, ఫిషరీస్ వి ద్యార్థులు వంశీకృష్ణ, బాల్‌రాజ్ ఉత్తమ ప్రతిభ చూపి ప్రశంసాపత్రాలు పొందారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో వంశీకృష్ణ, బాల్‌రాజ్‌ను ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, అధ్యాపకులు అభినందించారు. ఆయా విభాగాల అధిపతులు మ ల్సూర్ తిరుమల, దినకర్ చిన్న, జీ శ్రీనివాస్‌రావు, అధ్యాపకులు పవన్‌కుమార్, మైత్రి, రాజేశ్వర్, ప్రత్యూష, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.


