30న జిల్లా స్థాయి నెట్‌బాల్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

30న జిల్లా స్థాయి నెట్‌బాల్‌ ఎంపికలు

Sep 26 2026 1:08 AM | Updated on Sep 26 2026 1:08 AM

కామారెడ్డి అర్బన్‌: జిల్లా నెట్‌బాల్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో ఈ నెల 30న బుధవారం ఉద యం 10 గంటలకు భిక్కనూర్‌ జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో సబ్‌జూనియర్‌ అండర్‌–16, జూనియర్‌ 19 బాలబాలికలు, సీని యర్‌ పురుషులు, మహిళలు జిల్లాస్థాయి ఎంపి కలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘురామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్‌, స్పోర్ట్స్‌ డ్రెస్‌తో హాజరుకావాలని సూచించారు.

28న ఉమ్మడి జిల్లాస్థాయి రగ్బీ ఎంపికలు

కామారెడ్డి అర్బన్‌: ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28న సోమవారం ఉదయం 9 గంటలకు మాచారెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి జిల్లా అండర్‌–14 బాల బాలికల రగ్బీ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి ఈ.శ్రీధర్‌, పీడీ విజయలక్ష్మి తెలిపారు. పూర్తి వివరాలకు 99493 77983, 94400 04112 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

పంట సాగు వివరాలు నమోదు చేసుకోవాలి

కామారెడ్డి రూరల్‌: రైతులు తమ భూముల్లో సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకోవాలని ఏఈవో ప్రతిమ సూచించారు. శుక్రవారం మండలంలోని గూడెం గ్రామంలో క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న డిజిటల్‌ క్రాఫ్ట్‌ సర్వే ప్రక్రియను పరిశీలించారు. రైతులు సర్వే యర్‌కి అందుబాటులో ఉండి సర్వే నంబర్ల వారిగా, వారు సాగు చేస్తున్న పంట వివరాల ను నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఫార్మ ర్‌ రిజిస్ట్రీ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నా రు. సర్పంచ్‌ యాదగిరిగౌడ్‌, సర్వేయర్‌ భాను, ఉప సర్పంచ్‌ అశోక్‌, రైతులు పాల్గొన్నారు.

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): మండలంలోని తహసీల్‌ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను తహసీల్దార్‌ రాజశేఖర్‌ శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీపీవో రాములు, కాంగ్రెస్‌ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు మల్లప్ప పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

సరిహద్దుల కోసం సర్వే

నాగిరెడ్డిపేట: మండలంలోని పోచారం గ్రామసమీపంలోని వేంకుంట సరిహద్దులను గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు శుక్రవారం సంయుక్తంగా సర్వే చేశారు. వేంకుంటకు సంబంధించిన శిఖం భూమి కబ్జాకు గురైందని గ్రామానికి చెందిన శ్రీనివాసరావు మండలస్థాయి ప్రజావాణిలో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇరిగేషన్‌ ఏఈ అక్షయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సర్వే అధికారులు వేంకుంట సరిహద్దులను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. సర్వే నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంటర్‌లో స్పాట్‌ అడ్మిషన్లు

బాన్సువాడ రూరల్‌: దుర్కి గ్రామంలో కొనసాగుతున్న హన్మాజీపేట్‌ గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్‌ స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్యామలదేవి శుక్రవారం తెలిపారు. ఎంపీసీ, బైపీసీ ఆంగ్లమాద్యమ విభాగంలో పరిమిత సంఖ్యలో సీట్లు ఖా ళీగా ఉన్నాయని అర్హులు శనివారం కళాశాలలో ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement