కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో నిర్వహించే వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి తెలిపారు. సోమవారం అధికారులతో కలిసి శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ఊరేగింపు రూట్ మ్యాప్, టేక్రియాల్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. డీఎస్పీ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, సీఐ నరహరి, డీఈ హన్మంతారావు, ఏఈ వేణుప్రసాద్, టీపీవో వినీత్, ఎలక్ట్రిసిటీ డీఈ నందకుమార్, కౌన్సిలర్లు, నాయకులు శ్రీనివాస్, షేరూ తదితరులు పాల్గొన్నారు.


