‘ఆగమన్‌’కు అనుమతి లేదు | - | Sakshi
Sakshi News home page

‘ఆగమన్‌’కు అనుమతి లేదు

Sep 8 2026 1:29 AM | Updated on Sep 8 2026 1:29 AM

పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి

కామారెడ్డి క్రైం: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాలను తీసుకువచ్చేందుకు కొత్తగా చేపడుతున్న ‘ఆగమన్‌’ కార్యక్రమానికి అనుమతి లేదని పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి పేర్కొన్నారు. ఆగమన్‌ నిర్వహణకు చాలా మంది అనుమతులు అడుగుతున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు, గణేశ్‌ మండప నిర్వాహకులు ఆగమన్‌ నిర్వహించొద్దని స్పష్టం చేశారు. గణేశ్‌ విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జన సమయాల్లో డీజే పెట్టడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.

తెలంగాణ విద్యుత్‌ ఎంప్లాయీస్‌

యూనియన్‌ కార్యవర్గం

కామారెడ్డి అర్బన్‌: తెలంగాణ విద్యుత్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (హెచ్‌–82) కామారెడ్డి జిల్లా, డివిజన్‌ నూతన కార్యవర్గాలను సోమవారం ఎన్నుకున్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శులు సాయిలు, జాషువా, నాయకులు నరేష్‌, బాలయ్య తదితరుల సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. జిల్లా అధ్యక్షుడిగా బి.హరికృష్ణ, కార్యదర్శిగా ఏ.కిష్టాగౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా డి.హన్మాండ్లు, కామారెడ్డి డివిజన్‌ అధ్యక్షుడిగా జి.రంజిత్‌యాదవ్‌, కార్యదర్శిగా ఎం.రాజు ఎన్నికయ్యారు.

రేపు ఉద్యోగమేళా

కామారెడ్డి అర్బన్‌: హెచ్‌సీఎల్‌ టెక్‌ సంస్థలో ఐటీ, నాన్‌ ఐటీ ఉద్యోగాల కోసం బుధవా రం ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా ని ర్వహించనున్నారు. ఈ విషయాన్ని కామారె డ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కే.విజయ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరంలో ఇంటర్‌ ఎంపీసీ లేదా ఎంఈసీలో 75 శాతం మార్కులు, గణితంలో 80శాతం మార్కులు పొందిన వారు ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు https://www.hcltechbee.com/ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలని, పూర్తి వివరాలకు 80740 65803, 97016 65424 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

టాస్క్‌లో డేటా అనలిటిక్స్‌

శిక్షణ కార్యక్రమం

ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ స మీపంలోగల టాస్క్‌ ప్రాంతీయ కేంద్రంలో డేటా అనలిటిక్స్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ రీజినల్‌ మేనేజర్‌ హన్మంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌), నిజామాబాద్‌ రీజినల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో 45 రోజుల ‘డేటా అనలిటిక్స్‌’ శిక్షణ కార్యక్రమా నికి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని చె ప్పారు. ఎక్స్‌ఎల్‌, డాటా ఫౌండేషన్‌, ఎస్‌ క్యూఎల్‌ ఫర్‌ డాటా అనలిటిక్స్‌, ఫైథాన్‌, న్యూపే, ఫాండస్‌, విజువలైజేషన్‌ అండ్‌ పవ ర్‌ బీఐ, క్యాప్‌ స్టాన్‌, ఎంప్లాయ్‌బిలిటీ, ఆప్టిట్యూడ్‌, రిజనింగ్‌(ఏఆర్‌), బీహావిరియల్‌ అండ్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌ (బీఎస్‌ఎం) వంటి అంశా లపై శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఏఆర్‌, బీఎస్‌ఎం మాడ్యూల్స్‌ కార్యక్రమం చివరి దశలో నిర్వహించబడతాయని తెలిపారు. ఈనెల 15న శిక్షణ ప్రారంభమవు తుందని, కోర్సు ఫీజు రూ. 1,999 చెల్లించా లని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా కేంద్రంలోని టాస్క్‌ రిజినల్‌ సెంటర్‌, ఐటీ టవర్‌ ను సంప్రదించాలని, లేదా 70136 75052ను సంప్రదించాలని తెలిపా రు. డేటా అనలిటిక్స్‌ రంగంలో ఉద్యోగ అవకాశాలకు అవసరమైన ప్రాక్టికల్‌ నైపుణ్యాల ను అభివృద్ధి చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల ని కోరారు.

కిడ్నాప్‌ కేసులో

దంపతుల రిమాండ్‌

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బాలుడిని కిడ్నాప్‌ చేసిన దంపతులు సుజాత, ఎల్లంలను సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఆదివారం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించామని, సోమవారం నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారని ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement