కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

Sep 8 2026 1:29 AM | Updated on Sep 8 2026 1:29 AM

హామీల అమలులో సర్కారు విఫలం

మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌

ప్రజావాణిలో ఫిర్యాదు

మాచారెడ్డి: ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి వాటి అమలులో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ డి మాండ్‌ చేశారు. సోమవారం మాచారెడ్డిలో బీఆర్‌ఎ స్‌ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంత రం కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలపై ఎంపీడీవో కా ర్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్‌ మాట్లాడు తూ.. యూరియా యాప్‌తో రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్‌ తేవడంలో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. పనికిరాని యాప్‌ను రద్దుచేసి పాత పద్ధతిలోని యూరియా అందించాలని డి మాండ్‌ చేశారు. కేసీఆర్‌ హయాంలో తెలంగాణ ప్ర భుత్వం పంజాబ్‌ను మించి ధాన్యం కొనుగోలు చేసి దేశంలోనే ముందున్నదన్నారు.

రోడ్డుపై బైఠాయింపు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మహిళా ఎ మ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు పై నిరసన వ్యక్తం చేస్తూ కామారెడ్డి– సిరిసిల్ల రోడ్డు పై గంప గోవర్ధన్‌ బైఠాయించారు. వెంటనే కాంగ్రెస్‌ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షు డు ముజిబొద్దీన్‌, మాజీ జెడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాల్‌చంద్రం, నాయకులు బూస శ్రీనివాస్‌, హెమ్లా నాయక్‌, కిషన్‌, అబ్దుల్‌ ఖాన్‌, ఎడపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement