మద్నూర్: ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని మాజీ ఎ మ్మెల్యే హన్మంత్ సింధే పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద సోమవారం బీఆర్‌ఎ స్ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా హన్మంత్ సింధే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. రాష్ట్ర ప్రభు త్వ వైఫల్యాలకు నిరసనగా నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలను పోలీసులతో అడ్డుకున్నారని, ఈ క్రమంలో బీఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డారని పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేతో పోలీసులు దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. అనంతరం ఎన్నిక ల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయా లని కోరుతూ ప్రజావాణిలో వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సురేశ్, కృష్ణ పటేల్, రాజేశ్వర్‌గౌడ్, విజయ్‌కుమార్, నాగేశ్ పటేల్ పాల్గొన్నారు.


