లక్ష్య సాధనలో నిర్లక్ష్యం పనికిరాదు | - | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధనలో నిర్లక్ష్యం పనికిరాదు

Sep 8 2026 1:29 AM | Updated on Sep 8 2026 1:29 AM

అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి

కామారెడ్డి క్రైం: వన మహోత్సవంలో భాగంగా కే టాయించిన లక్ష్యాన్ని సాధించడంలో నిర్లక్ష్యం పని కిరాదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి అధికారులకు సూచించారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పనుల పురోగతిపై సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీ గా సాధించిన పురోగతి, ఇంకా పూర్తి చేయాల్సిన ల క్ష్యాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడు తూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పచ్చదనం పెంపు, ప ర్యావరణ పరిరక్షణ కోసం అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ పనుల్లో వేగం పెంచాలని ఎంపీడీవోలను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ విక్టర్‌, జెడ్పీ సీఈవో చందర్‌, డీఆర్డీవో దామోదర్‌రెడ్డి, ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్‌ రవితేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement