పాత బట్టలతోనే బడికి.. | - | Sakshi
Sakshi News home page

పాత బట్టలతోనే బడికి..

Aug 21 2026 2:51 AM | Updated on Aug 21 2026 2:51 AM

పాత బట్టలతోనే బడికి..

త్వరలోనే పంపిణీ చేస్తాం

కామారెడ్డి టౌన్‌: పాఠశాలలు పున:ప్రారంభమై రెండు నెలలు గడిచినా విద్యార్థులకు ఏకరూప దుస్తులను (యూనిఫాంలు) అందించడంలో విద్యాశాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంపిణీ చేస్తామని అటు ప్రభుత్వం, ఇటు అధికారులు చెప్పినా.. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క విద్యార్థికి సైతం యూనిఫాం అందలేదు. దీంతో ప్రభుత్వ బడులకు విద్యార్థులు పాత దుస్తులు, లేదా సాధారణ దుస్తులతోనే వస్తున్నారు.

ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందని వస్త్రం

జిల్లాలో మొత్తం 1,020 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి. వీటిలో ఈ విద్యా సంవత్సరం 81,039 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం తరఫున ఉచితంగా రెండు జతల యూనిఫాంలు అందించాల్సి ఉంది. యూనిఫాం కుట్టే బాధ్యతను జిల్లాలోని మహిళా సంఘాలకు అప్పగించారు. ఆగస్టు 15 నాటికి కనీసం ఒక జత దుస్తులనైనా అందజేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. వస్త్ర సరఫరాలో జాప్యం, కుట్టు కూలీ పనుల్లో ఆలస్యం కారణంగా అనుకున్న సమయానికి పంపిణీ చేయలేకపోయారు. ఇప్పటికీ తొమ్మిది మండలాలకు పూర్తిస్థాయిలో వస్త్రం సరఫరా కాలేదని, షర్టు మాత్రమే సిద్ధం చేస్తున్నారని, ఇంకా ప్యాంట్‌ కుట్టడం ప్రారంభం కాలేదని తెలిసింది. దీంతో ఈ నెలాఖరు నాటికై నా ఏకరూప దుస్తులు పంపిణీ అవుతాయో లేదోనన్న సందిగ్ధం నెలకొంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే యూనిఫాంలు సిద్ధం చేసి పంపిణీ చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

కుట్టు పనులను మహిళా స్వయం సహాయక సంఘా లకు అప్పగించాం. పనులను వేగవంతం చేయాలని ఆదేశించాం. నాణ్యతతో కూడిన దుస్తులను వీలైనంత త్వరగా విద్యార్థులకు అందజేస్తాం. ఈ నెలాఖరులోగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ఒక జత యూనిఫాంతోపాటు షూ, సాక్స్‌, బెల్ట్‌ అందిస్తాం.

– మల్లికార్జున్‌, డీఈవో, కామారెడ్డి

‘ఏకరూప’ దుస్తులు ఎప్పుడు అందేనో!

పంద్రాగస్టు దాటినా

పత్తాలేని యూనిఫాంలు

ఈ నెలాఖరుకై నా పంపిణీ జరిగేనా

జిల్లాలో ఎదురుచూస్తున్న

81,039 మంది విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement