సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అధ్వానంగా మారిన జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లకు గురువారం మరమ్మతులు ప్రారంభించారు. పట్టణంలోని రోడ్ల దుస్థితిపై ఈనెల 11 న ‘సాక్షి’లో ప్రచురితమైన రహ‘దారిద్య్రం’ కథనంపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. అధికారులతో మాట్లాడి వెంటనే అవసరమైన మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. పట్టణంలోని అడ్లూర్ రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో పనులు చేపట్టారు. అలాగే అశోక్‌నగర్ రోడ్డులో గుంతలు పూడ్చివేయించారు. పట్టణంలోని రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.


