సంక్షేమం తోడుగా.. | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం తోడుగా..

Aug 16 2026 1:33 AM | Updated on Aug 16 2026 1:33 AM

న్యూస్‌రీల్‌

ప్రగతి పరుగులు

ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026

మాట్లాడుతున్న వీహెచ్‌

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం : కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అగ్రగామిగా నిలుస్తోందని ప్రభుత్వ బీసీ సంక్షేమం, అభివృద్ధి సలహాదారు వి.హనుమంతరావు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ప్రగతిని నివేదించారు. వీహెచ్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

● జిల్లాలో 2,97,438 కుటుంబాలకు ఆహార భద్రతకు సంబంధించిన స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేస్తున్నాం.

● జిల్లాలో రూ.500 లకు గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా కింద ఇప్పటివరకు 1,51,503 మంది లబ్ధిదారులకు 8,93,705 సిలిండర్లు పంపిణీ చేశాం. దీనికి ప్రభుత్వం రూ.27.15 కోట్లు సబ్సిడీ ఇచ్చింది.

● చేయూత పథకం ద్వారా 1,55,344 మంది లబ్ధిదారులకు వివిధ రకాల పింఛన్ల కోసం ప్రతి నెల రూ.38.50 కోట్లు వెచ్చిస్తున్నాం.

● గృహజ్యోతి కింద జిల్లాలో 1,75,087 మంది వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కోసం ఇప్పటివరకు రూ.155.31 కోట్లు ఖర్చు చేశాం.

● జిల్లాలో 1,18,827 వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. ప్రస్తుత సంవత్సరం 924 నూతన వ్యవసాయ కనెక్షన్ల కోసం రూ.6.47 కోట్లు ఖర్చు చేశాం.

● రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 18,369 మందికి శస్త్ర చికిత్సలకు రూ.50.56 కోట్లు, ఈ ఏడాది 5,691 మందికి రూ.16.51 కోట్లు వెచ్చించాం.

● బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న 4,725 మంది విద్యార్థులకు రూ. 5.31 కోట్లు ఉపకార వేతనంగా అందించాం. 935 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.50.97 లక్షలు మంజూరు చేశాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 3,351 మంది విద్యార్థులకు రూ.2.47 కోట్లు చెల్లించాం. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా 36 మంది విద్యార్థులకు కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పించాం.

● మైనారిటీ సంక్షేమం లో భాగంగా 79 మందికి ఉపాధి కల్పన నిమిత్తం రూ.46 లక్షలు మంజూరు చేశాం.

● కులాంతర వివాహం చేసుకున్న 28 జంటలకు ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా రూ.70 లక్షలు ఇచ్చాం.

● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుప డింది. ఈ విద్యాసంవత్సరంలో 4,031 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు.

●పోలీస్‌ శాఖ ద్వారా జిల్లాలో రోడ్డు ప్రమాదాల ని వారణకు అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమం చేపట్టడం ద్వా రా ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ఆపరేషన్‌ కవచ్‌ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రివెంటివ్‌ పోలీసింగ్‌ ద్వారా ప్రజలకు నమ్మకమైన రక్షణ కవచంగా పోలీసు శాఖ నిలిచింది.

అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తున్నాం

ప్రభుత్వ బీసీ సంక్షేమం, అభివృద్ధి

సలహాదారు వి.హనుమంతరావు

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement