నేడు బిచ్కుందకు సీఎం రాక | - | Sakshi
Sakshi News home page

నేడు బిచ్కుందకు సీఎం రాక

Aug 16 2026 1:33 AM | Updated on Aug 16 2026 1:33 AM

ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కూతురు వివాహ విందులో పాల్గొననున్న

రేవంత్‌రెడ్డి

భారీ భద్రత ఏర్పాట్లు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వెనకబడిన ప్రాంతమైన జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుందకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కూతురు వివాహ విందులో ఆయన పాల్గొంటారు. ఎమ్మెల్యే తన కూతురు పెళ్లి రిసెప్షన్‌కు రావాలని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులకు పెద్ద ఎత్తున ఆహ్వాన పత్రికలు పంపించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారిగా జుక్కల్‌ నియోజకవర్గానికి వస్తుండడంతో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశాలున్నాయి. సీఎం పెళ్లి వేడుకలో పాల్గొనడానికే వస్తున్నప్పటికీ నియోజకవర్గంపై వరాల జల్లులు కురిపిస్తారన్న ఆశలో జనం ఉన్నారు.

ప్రజలు ఏం ఆశిస్తున్నారంటే..

నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వర్షాలపైనే ఆధారపడి ఆరుతడి పంటలు పండిస్తున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఉన్నా ఈ నియోజకవర్గానికి పెద్దగా ఉపయోగపడదు. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో సింగితం రిజర్వాయర్‌ రి టెయినింగ్‌ వాల్‌ కొట్టుకుపోయింది. తాత్కాలిక మ రమ్మతులతోనే నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

● అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి పనులు దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. గత ప్ర భుత్వ హయాంలో మంజూరైన నాగమడుగు ఎత్తిపోతల పథకం మొదట్లోనే ఆగిపోయింది. దాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆయా ప్రాజెక్టులకు సీఎం నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నారు.

● కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాలకు దూరాన ఉన్న జుక్కల్‌ ప్రాంతంలో ఉన్నత విద్యావకాశాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ప డుతున్నారు. ఇక్కడ పీజీ సెంటర్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

● జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే సరైన బస్సు సౌ కర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బస్‌ డిపో ఏర్పాటు చేస్తే మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.

● నియోజకవర్గంలో అపరాలు ఎక్కువగా సాగవుతాయి. అయితే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు లేకపోవడంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించలేకపోతున్నారు. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సీఎం రాక నేపథ్యంలో చేసిన ఏర్పాట్లు

హెలీప్యాడ్‌ సిద్ధం..

నిజాంసాగర్‌ : బిచ్కుంద పట్టణ శివారులోని డీ బీఎల్‌ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించే జు క్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కూతురు వివా హ విందు కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నా రు. ఈ నేపథ్యంలో అధికారులు హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. హెలీప్యాడ్‌నుంచి డీబీఎల్‌ ప్రాంగణం వరకు భారీ భద్రత కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement