స్టెప్పులతో సందడి చేసిన వీహెచ్‌ | - | Sakshi
Sakshi News home page

స్టెప్పులతో సందడి చేసిన వీహెచ్‌

Aug 16 2026 1:33 AM | Updated on Aug 16 2026 1:33 AM

స్టెప్పులతో సందడి చేసిన వీహెచ్‌

స్వాతంత్య్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన వీహెచ్‌.. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులతో కలిసి స్టెప్పులేశారు. బాన్సువాడ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శన ఇస్తున్న సమయంలో.. ఉత్సాహాన్ని ఆపుకోలేక ఆయన వేదిక దిగి వారి వద్దకు వచ్చి నృత్యం చేశారు. వీహెచ్‌తో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ జత కలిశారు. స్వాతంత్య్ర దినోత్సవాలలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర, డీఎఫ్‌వో నీరజ్‌ కుమార్‌ టిబ్రెవాల్‌, అదనపు కలెక్టర్లు విక్టర్‌, గిరి, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement