● స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి
పల్లెల రూపురేఖలు మారాలి
● ‘సాక్షి’ డిబేట్‌లో విద్యార్థులు
కామారెడ్డి క్రైం/కామారెడ్డి టౌన్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతోంది. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ థీమ్‌గా కేంద్రప్రభుత్వం ‘యువశక్తి’ని ఎంచుకుంది. ఈ నేపథ్యంలో 2047 నాటికి జిల్లా, దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, దేశ ప్రగతిలో యువత పాత్ర అన్న అంశాలపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌కే డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ ప్రత్యేక డిబేట్ నిర్వహించింది. విద్యార్థులు తమ ఆలోచనలను, ఆకాంక్షలను వెలిబుచ్చారు.
విద్యార్థుల అభిప్రాయాలు 8లో..


