నిత్యం జనం మధ్యే.. | - | Sakshi
Sakshi News home page

నిత్యం జనం మధ్యే..

Aug 15 2026 1:33 AM | Updated on Aug 15 2026 1:33 AM

నిత్యం జనం మధ్యే..

మాచారెడ్డి సర్పంచ్‌ సంతోష్‌రెడ్డి నిత్యం జనం మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. గ్రామంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. ముఖ్యంగా గ్రామంలోని ఒక ప్రాంతానికి సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యను పరిష్కరించారు. గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి బోర్లు తవ్వించారు. ప్రభుత్వం ఫించన్ల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు అడగకముందే గ్రామంలో అర్హత ఉన్న వారి జాబితాను రూపొందించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు తయారు చేయించి రెడీ చేశారు. గ్రామంలో విద్యుత్‌ దీపాల సమస్య, రోడ్ల సమస్యలకు పరిష్కారం చూపారు. అధికారులతో కలిసి గ్రామంలో తిరుగుతూ ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement