నాగిరెడ్డిపేట మండలం తాండూర్ సర్పంచ్ యాదాగౌడ్ గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. సర్పంచ్ హోదాలో రోజూ చేసే పనులన్నింటినీ ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లో రోజువారీగా తప్పనిసరిగా నమోదు చేస్తుంటారు. గ్రామంలో సర్‌కు సంబంధించి చాలా మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలను ఆయనే స్వయంగా నింపి ఇచ్చారు. గ్రామస్తులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం వైకుంఠరథంతో పాటు, నీళ్ల ట్యాంకర్‌ను సమకూరుస్తున్నారు. సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించి వారితో దరఖాస్తు చేయిస్తున్నారు. నిరుద్యోగులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఉద్యోగాల సమాచారం చేరవేస్తూ వారిని గైడ్ చేస్తున్నారు.


