నాగిరెడ్డిపేట: ఎల్‌నినో ప్రభావంతో ఈయేడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. వర్షాకాలం ప్రారంభమై సుమారు రెండు నెలలు కావచ్చినా సరైన వర్షాలు లేకపోవడంతో సాగు పనులు ముందుకు సాగలేదు. ఇటువంటి తరుణంలో కురిసిన భారీవర్షాలతో మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. దీంతో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లోని పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈయేడు ఆయకట్టు పరిధిలో ఖరీఫ్ పంటల సాగుకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని, పంటల సాగుపై ధీమా కలిగిందని అన్నదాతలు పేర్కొంటున్నారు.
ఖరీఫ్ సాగుకు భరోసా ఇచ్చిన
భారీ వర్షాలు
నిండుకుండలా
తొణికిసలాడుతున్న పోచారం ప్రాజెక్టు
హర్షం వ్యక్తం చేస్తున్న
ఆయకట్టు రైతులు


