ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ

Aug 12 2026 1:28 AM | Updated on Aug 12 2026 1:28 AM

ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ మరో రెండు వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయండి రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక సాగులో శాసీ్త్రయ పద్ధతులు పాటించాలి డెంగీ బారిన అక్కాచెల్లెళ్లు

కామారెడ్డి రూరల్‌: హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం దేవునిపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కాసర్ల రవీందర్‌, చిన్నోళ్ల రజినీకాంత్‌, భోజన్నగారి రాజు పాటిల్‌, తుమ్మ నవీన్‌, శేఖర్‌, దొడ్లె స్వామి, ధోనీ, ఉప్పురాజు తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అర్హత కలిగిన అనేక మంది పేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో మరో 2వేల ఇళ్లు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో రెవెన్యూ, హౌసింగ్‌ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. మొదటి విడతలో ఇళ్ల మంజూరులో అవకాశం దక్కని అర్హులైనవారందరికీ అవకాశం కల్పించేలా అదనపు ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. నిధులు సకాలంలో అందితే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరితగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

కామారెడ్డి అర్బన్‌: పట్టణంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్టస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్‌ఎం మాధవి, పీఈటీ హీరాలాల్‌ తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి అండర్‌–14 యోగాసన పోటీల్లో రిథమిక్‌ యోగాలో శ్రీకాంత్‌, శశివర్ధన్‌ బంగారు పతకాలు పొందగా, ఆర్టిస్టిక్‌ యోగాలో భానుతేజ, రాంచరణ్‌ బంగారు పతకాలు సాధించారు. సింగిల్‌ ఆర్టిస్టిక్‌ యోగాలో శశివర్ధన్‌ బంగారు పతకం గెలుచుకున్నారు. దీంతో వీరిని రాష్‌ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారని హెచ్‌ఎం తెలిపారు.

తాడ్వాయి: సాగులో శాసీ్త్రయ పద్ధతులు అవసరమని, వ్యవసాయశాఖ సూచనల మేరకు రైతులు ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడల పర్యవేక్షణను సకాలంలో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని డీఏవో మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎండ్రియాల్‌ గ్రామంలో చాకలి రాస్వామి అనే రైతు అలెక్‌ మిషన్‌ ద్వారా (డైరెక్ట్‌ సోయింగ్‌) సాగు చేసిన వరి పంటను మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా రైతుతో మాట్లాడి పంట పెరుగుదల, పోషక నిర్వహణ, నీటి వినియోగ సామర్థ్యం, కలుపు నివారణ, సమగ్ర పంట యాజమాన్యంపై సూచనలు అందించారు. తక్కువ నీరు, తక్కువ కూలీ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేందుకు ప్రత్యక్ష విత్తన వరి సాగు ఒక ఉత్తమ ప్రత్యామ్నాయ పద్ధతి అని వివరించారు. అనంతరం రైతుకు పీఎస్‌బీ ఫార్ములా–6, నానో యూరియా పంపిణీ చేశారు. ఏడీఏ సుధామాధురి, ఏవో నర్సింలు, సర్పంచ్‌ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మాచారెడ్డి: గజ్యానాయక్‌ తండా (మాచారెడ్డి) చౌరస్తాలో ఇద్దరు తోబుట్టువులు డెంగీ సోకి ఆస్పత్రి పాలయ్యారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరికి ఈనెల 5న జ్వరం రాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గోపిబాబు, వైద్యాధికారి ఆదర్శ్‌, సర్పంచ్‌ వినోద, ఉప సర్పంచ్‌ భిక్షపతి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. వైద్య సిబ్బంది గ్రామంలో పలువురినుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement