● బస్ షెల్టర్ లేని మూడు జిల్లాల కూడలి
● మాచారెడ్డి చౌరస్తాలో
ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు
మాచారెడ్డి: గజ్యానాయక్ తండా చౌరస్తా.. దీనినే మాచారెడ్డి చౌరస్తాగా పిలుస్తారు. ఇది కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల కూడలి ప్రాంతం. నిత్యం వేలాది మంది ఈ కూడలి మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు ఎండుతున్నామని.. వానకు తడుస్తున్నామని.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


