పెద్దకొడప్‌గల్: మారుమూల గ్రా మమైన బాబుల్‌గావ్‌కు ఎట్టకేలకు బస్సొచ్చింది. దీంతో జనం మోములో సంతోషం వెల్లివిరిసింది. రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మారుమూల గ్రామమైన బాబుల్‌గావ్ సమస్యలపై జూన్ 29న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన అధికారులు ఆయా సమస్యలకు పరిష్కారం చూపింది. తాజాగా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మంగళవారం ఉదయం గ్రామానికి తొలిసారిగా ఆర్టీసీ బస్సు వచ్చింది. ఇప్పటివరకు బస్సు ఎరుగని గ్రామానికి బస్సు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్లూ బస్సు లేకపోవడంతో ఇబ్బందిపడ్డాం. ఆటో చార్జీలు పెట్టుకుని వేరే ఊళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా బాబుల్‌గావ్‌కు బస్సు వచ్చినందుకు ఆనందంగా ఉంది. బస్సులో ఫ్రీగా ప్రయాణం చేశాం.
– చాకలి సులుబాయ్, బాబుల్‌గావ్‌వాసి
మా ఊరునుంచి బస్సు లేకపోవడంతో పొరుగూళ్లకు నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. ఇప్పుడిప్పుడు ఆటోలు వచ్చినై. ఇప్పుడు అధికారులు బస్సు వేయడంతో మాకు నడిచే బాధ తప్పింది.
– గురుపల్లి మాణిక్, బాబుల్‌గావ్‌వాసి
మా ఊరికి బస్సు సౌకర్యం లేదు. ఎక్కడికై నా వెళ్లాలంటే కాలినడకన లేదా ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చేది. మా సమస్యను సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు స్పందించి మొదటిసారి బస్సు నడిపారు. సంతోషంగా ఉంది. ‘సాక్షి’కి, అధికారులకు కృతజ్ఞతలు.
– రవి, సర్పంచ్, బాబుల్‌గావ్


