● అదిరే.. లుక్‌ అదిరే! | - | Sakshi
Sakshi News home page

● అదిరే.. లుక్‌ అదిరే!

Aug 12 2026 1:28 AM | Updated on Aug 12 2026 1:28 AM

● అదిరే.. లుక్‌ అదిరే!

బాన్సువాడ : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం కొత్త లుక్‌తో కనిపించారు. ఎక్కువగా సంప్రదాయ వస్త్రధారణతో కనిపించే ఆయన.. ఈరోజు సూటు, బూటుతో గిరిజనుల ఉత్సవాలలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం సంగెంలో నిర్వహించిన తీజ్‌ ఉత్సవాలలో పాల్గొని, గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్‌ పండుగ ప్రతీకగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ శ్యామల, మాజీ ఎంపీపీ విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement