మండలంలోని పోచారం ప్రాజెక్టు నుంచి నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో అధికారికంగా 10,200 ఎకరాలకు, అనధికారికంగా మరో 5 వేల ఎకరాల వరకు సాగు నీరు అందుతుంది. గతంలో ఖరీఫ్ పంటలసాగు పనులు ప్రారంభమైనప్పటి నుంచి సాగు పూర్తయ్యేవరకు ప్రాజెక్టు నుంచి నిరంతరాయంగా నీటిని విడుదల చేసేవారు. రబీ సీజన్‌లో విడతలవారీగా నీరిచ్చేవారు. కాగా ఈయేడు నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తొలిసారి ఖరీఫ్‌లోనూ విడతలవారీగా నీరివ్వాలని నిర్ణయించారు. ఆయకట్టుకు నాలుగు విడతల్లో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్నారు. 15 రోజులపాటు నీటిని విడుదల చేసి తర్వాతి 10 రోజులు విరామమిస్తారు. ఇలా నాలుగుసార్లు నీరందిస్తారు. ప్రస్తుతం మొదటి విడత నీటివిడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టునుంచి నీటి విఉడదల కొనసాగుతుండడంతో ఆయకట్లు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.


