బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో తాను క్యాంప్ కార్యాలయం నిర్మించుకోనున్న స్థలాన్ని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంజినీర్‌తో క్యాంప్ కార్యాలయం భవనానికి సంబంధించిన ప్లానింగ్ వేయించారు. ఏనుగు రవీందర్‌రెడ్డి నస్రుల్లాబాద్‌కు వస్తున్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కార్యకర్తలు చూడాలన్నారు. పార్టీ స్థితిగతులపై కార్యకర్తలతో చర్చించారు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌యాదవ్, మాసాని శ్రీనివాస్‌రెడ్డి, కొత్తకొండ భాస్కర్, మంత్రి గణేశ్, కరుణాకర్‌రెడ్డి, బోయిని లక్ష్మణ్, బుద్దె గంగాధర్, ఉప్పరి లింగం, పాత బాలకృష్ణ, నందురెడ్డి, వెంకట్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
దోమకొండ: మండల కేంద్రంలోని గడికోటలో మంగళవారం పర్యాటకుల సందడి నెలకొంది. సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షుడు పున్న రాజేశ్వర్, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రాజం ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 60 మంది రిటైర్డు ఉద్యోగులు బస్సుల్లో గడికోటకు తరలివచ్చారు. కోటలోని మహదేవుని ఆలయం, వెంకటపతిభవన్, క్లాక్‌భవన్, అద్దాలమేడ, ప్రహరీ వాటి చరిత్రను తెలుసుకున్నారు. వారి వెంట రిటైర్ట్ ఎంప్లాయీస్ ఉమ్మడి దోమకొండ మండల అధ్యక్షుడు వెంకయ్య, సర్పంచ్ ఐరేని నర్సయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్ధరాములు తదితరులు ఉన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): రైతులు పట్టాదారు పాసుబుక్కులకు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించాలని వ్యవసాయశాఖ ఏఈవో మధుసూదన్ అన్నారు. మంగళవారం మహమ్మద్ నగర్ మండలం గున్కుల్ గ్రామ పంచాయతీలో ఈకేవైసీ ప్రాముఖ్యతపై రైతులకు అవగాహ కల్పించారు. ఈకేవైసీ లేకుంటే ప్రభుత్వ పథకా లకు దూరం అవుతారని పేర్కొన్నారు. సర్పంచ్ గంగి రమేష్‌యాదవ్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య రైతులు వెంకాగౌడ్, ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
లింగంపేట: మండల ఏఎస్సైగా పెంటయ్యకు మంగళవారం పదోన్నతి వచ్చినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. పెంటయ్య లింగంపేట పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం పెంటయ్యను ఎస్సై దీపక్‌కుమార్ అభినందించారు. అలాగే శెట్పల్లిసంగారెడ్డికి చెందిన గ్రామస్తులు పెంటయ్యను లింగంపేట పోలీస్ స్టేషన్‌లో సన్మానించారు. అంజయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటూ.. పీఆర్టీయూకు పుట్ట శ్రీనివాస్ అందిస్తున్న సేవలు అభినందనీయమని మండల పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రసాద్, అవినాష్ పేర్కొన్నారు. 2026–28కిగానూ పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికై న నేపథ్యంలో పుట్ట శ్రీనివాస్‌ను మంగళవారం మండలకేంద్రంలో వారు ఘనంగా సత్కరించారు. ఎంఈవో వెంకట్‌రెడ్డి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నందిపేట్: నందిపేట్ పీఎస్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఐదుగురికి మెజిస్ట్రే ట్ గట్టు గంగాధర్ జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. నందిపేటకు చెందిన టేకు సాయి లు, గోసం చిన్నయ్యలకు ఐదు, సాయిలుకు నాలు గు, నిజామాబాద్ మండలం న్యాల్‌కల్‌కు చెందిన అశోక్‌కు ఐదు, నవీపేటకు చెందిన బొమ్మల రాజు కు మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహ నాలు నడపకూడదని సూచించారు.


