● హోర్డింగ్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
ఎల్లారెడ్డి: భార్య కాపురానికి రావడం లేదంటు ఓ వ్యక్తి హోర్డింగ్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థా నికులు తెలిపిన వివరాల ప్ర కారం.. లింగారెడ్డిపేట గ్రా మానికి చెందిన వడ్ల సత్యనారాయణకు భార్యకు గొడ వలు జరగడంతో కాపురానికి రావడం లేదు. దీంతో అతను సోమవారం రాత్రి పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న హోర్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సత్యనారాయణను సముదాయించి కిందికి దిగేలా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


