భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్‌పల్లి శివారు లో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను దుండగులు మంగళవారం ధ్వంసం చేశారు. అందులో ఉన్న కాపర్ కాయిల్స్‌ను దొంగిలించారు. వరుసగా వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసానికి గురవుతుండడంతో పంటలు ఎలా పండించాలంటు రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిజామాబాద్ అర్బన్ : నగరంలోని కోటగల్లికి చెందిన విద్యప్రసాద్(54) అదృశ్యమైనట్లు రెండో టౌన్ ఎస్సై యాదగిరిగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. విద్యాప్రసాద్‌కు మానసిక స్థితి బాగాలేదని గతంలో కూడా పలుమార్లు ఇంటినుంచి వెళ్లి తిరిగిరాలేదని కుటుంబీకులు తెలిపారు. భార్య వేదవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


