బాన్సువాడ : మేరు కుల గురువు నాందేవ్ మహ రాజ్ గొప్ప సంఘ సంస్కర్త అని మేరు సంఘం మండల అధ్యక్షులు హన్మాండ్లు అన్నారు. మంగళ వారం బాన్సువాడలో శ్రీ సంత్ శిరోమణి నాందేవ్ మహరాజ్ 676వ పుణ్య తిథిని నిర్వహించారు. ఆ యన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అ ర్పించారు. మేరు కులస్తులు కొత్త కొండ భాస్కర్, జీవన్, మహేష్, వార్కారీలు తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని వెల్లుట్లపేట శివారులో ఉన్న చెనింగ రాజరాజేశ్వరాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి, గ్రామస్తులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు హుండీలో ఉన్న నగదును దొంగిలించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


