వర్ని : చందూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులను హాస్టల్ వార్డెన్ చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సిగరెట్లు తాగుతున్నారని ఆరోపిస్తూ వార్డెన్ కల్పలత ఆదివారం పదిమంది విద్యార్థులను కర్రతో చితకబాదినట్లు విద్యార్థు లు ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా వార్డెన్ తిడుతూ కొడుతోందని, మోకాళ్లపై కూర్చోబెడుతోందని, స్నాక్స్ కరెక్ట్‌గా ఇవ్వ డం లేదని, గుంజీలు తీయిస్తోందని ఆరోపించారు. విషయం తెలుసు కున్న తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చి వార్డెన్‌ను నిలదీశారు. విద్యార్థు లు సిగరెట్లు తాగడం వల్లే కొట్టానని ఇకముందు ఇలా జరగకుండా చూస్తానని తల్లిదండ్రులకు వార్డెన్ హామీ ఇచ్చారు. ఈ విషయమై వార్డెన్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.


