ఐదేళ్లలోపు పిల్లల మరణాలను నివారించాలి | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలోపు పిల్లల మరణాలను నివారించాలి

Aug 12 2026 1:28 AM | Updated on Aug 12 2026 1:28 AM

డీఎంహెచ్‌వో రాజశ్రీ

సుభాష్‌నగర్‌ : ఐదేళ్లలోపు పిల్లల మరణాలను నివారించేలా వైద్యులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్‌లో గల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై డీఎంహెచ్‌వో సమీక్ష నిర్వహించారు. గర్భిణులు, చిన్న పిల్లల్లో ప్రమాదకర వ్యాధి లక్షణాలను ముందే గుర్తించాలని, బాలింతలను క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. సీపీఆర్‌పై అందరూ అవగాహన కలిగి ఉండాలని, మదర్‌ ఇన్‌, మదర్‌ ఔట్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. ఎంసీహెచ్‌ కార్డును తూ.చ తప్పకుండా అనుసరిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. శాశ్వత, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. పోచంపాడ్‌, నందిపేట్‌, రెంజల్‌, బినోల, చంద్రశేఖర్‌ కాలనీ, రుద్రూర్‌, జక్రాన్‌పల్లి, ముదక్‌పల్లి, వేల్పూర్‌, మోస్రా పీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాలతో సమీక్షించారు. డీఐవోఎం అశోక్‌, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement