మంజీర పరవళ్లు | - | Sakshi
Sakshi News home page

మంజీర పరవళ్లు

Aug 6 2026 2:20 AM | Updated on Aug 6 2026 2:20 AM

మంజీర పరవళ్లు

నాగిరెడ్డిపేట: పోచారం జలాలతో మంజీర నది పరవళ్లు తొక్కుతూ సాగుతోంది. జిల్లాలోని గాంధారి, తాడ్వాయి, లింగంపేట్‌ మండలాలలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలతో పోచారం ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది. పోచారం పూర్తి స్థాయిలో నిండడంతో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీరు ప్రాజెక్టు అలుగు పైనుంచి పొంగిపొర్లుతూ మంజీరలో కలిసి పరవళ్లు తొక్కుతోంది. బుధవారం ఉదయం ప్రాజెక్ట్‌ అలుగు పైనుంచి 7,978 క్యూసెక్కుల వరదనీరు మంజీర నదిలో కలిసింది. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 3,537 క్యూసెక్కులకు తగ్గడంతో అంతే మొత్తం అలుగుల ద్వారా వెళ్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement