తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు | - | Sakshi
Sakshi News home page

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు

Aug 6 2026 2:20 AM | Updated on Aug 6 2026 2:20 AM

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ‘ఆహార శుద్ధీకరణ యూనిట్లు ఏర్పాటు చేయాలి’ పెద్ద చెరువు పరిశీలన

మాచారెడ్డి: ప్రకృతి వ్యవసాయంతో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు పొందవచ్చని డీఏవో మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు తప్పనిసరి అధీకృత ఎరువులు, క్రిమిసంహారక మందులు మాత్రమే అమ్మాలన్నారు. సెంట్రల్‌ ఫెర్టిలైజర్‌ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం మాచారెడ్డిలో వరి నాటు యంత్రంతో వేసే నాట్లను పరిశీలించారు. లక్ష్మీరావులపల్లిలో ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ పథకంలో ఉన్న బీఆర్సీ యూనిట్‌ను సందర్శించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి పవన్‌ కుమార్‌, ఏఈవో గాయత్రి, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు ఉన్నారు.

కామారెడ్డి అర్బన్‌: మహిళా సంఘాలు ఆహార శుద్ధీకరణ యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి కావాలని డీఆర్‌డీవో దామోదర్‌ సూచించారు. ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థల క్రమబద్ధీ కరణ పథకం (పీఎంఎఫ్‌ఎంఈ) సింగిల్‌ విండో డ్రైవ్‌ కార్యక్రమం లబ్ధిదారుల సమావేశాన్ని బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో మాట్లాడుతూ గ్రామాల్లో మహిళా సంఘాలు ఏర్పాటు చేసే చిన్నచిన్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు బ్యాంకులు రుణాలు అందించాలన్నారు. ఈనెల 15లోగా పెండింగ్‌లో ఉన్న యూనిట్లకు రుణాలు అందించాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, అడిషనల్‌ డీఆర్‌డీవో విజయలక్ష్మి సూచించారు. నాబార్డు డీడీ ప్రవీణ్‌కుమార్‌, డీసీఐ జనరల్‌ మేనేజర్‌ తులసీదాస్‌, ఇక్రిశాట్‌ ప్రతినిధి రాజేష్‌, సెర్ప్‌ డీపీఎంలు సురేష్‌కుమార్‌, రాజయ్య, జిల్లాలోని ఆయా బ్యాంకుల మేనేజర్లు, ఏపీఎంలు పాల్గొన్నారు.

కామారెడ్డి క్రైం: కామారెడ్డి పెద్ద చెరువును ఎస్పీ రాజేశ్‌ చంద్ర, డీఎస్పీ మధుసూదన్‌ బుధవారం సాయంత్రం పరిశీలించారు. అలుగు ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు చెరువు వద్దకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారి వెంట పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, రూరల్‌ సీఐ శ్రీధర్‌, దేవునిపల్లి ఎస్సై రంజిత్‌, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement