● సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై తనిఖీలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : తాడ్వాయి మండలం కాళోజీవాడి గ్రామంలో శనివారం రాష్ట్ర అధికారుల బృందం పర్యటించింది. గ్రామ పంచాయతీ సమగ్ర అ భివృద్ధి ప్రణాళికలో భాగంగా కాళోజీవాడిని పైలట్ ప్రాజెక్టు గ్రామంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ డీడీ, ప్రొగ్రాం మానిటరింగ్ అధికారి సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజీవాడిలో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తయారీని పరిశీలించి, పొరపాట్లు ఉంటే సరి చేస్తున్నామన్నారు. ప్రణాళికలో భాగంగా గ్రామంలో మూడేళ్లపాటు అభివృద్ధి పను లు కొనసాగుతాయని వివరించారు. గ్రామ జనా భా, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర వివ రాలతో నివేదిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. డీఆర్డీవో దామోదర్ రెడ్డి, జెడ్పీ సీఈవో చందర్‌నాయక్, డీపీవో మురళి, పీఆర్ ఈఈ దుర్గాప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ రమేశ్, ఎంపీడీవో భరత్‌కుమార్, ఎంపీవో సవిత రెడ్డి, సర్పంచ్ చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ సాయికుమార్ తదితరులు ఉన్నారు.


