‘భూసేకరణ పనులు వేగవంతం చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘భూసేకరణ పనులు వేగవంతం చేయాలి’

Jul 17 2026 1:22 AM | Updated on Jul 17 2026 1:22 AM

‘భూసేకరణ పనులు వేగవంతం చేయాలి’ సబ్‌స్టేషన్‌ ముట్టడి పలువురు ఎస్సైల బదిలీ 20నుంచి ఎంపిక పోటీలు ‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరపాలి’ లెక్చరర్‌పై వేధింపులు.. విచారణ జరిపిన కమిటీ!?

బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలో ని సిద్దాపూర్‌ రిజర్వాయర్‌కు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ప్ర భుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీ నివాస్‌రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఇరిగేషన్‌, అ టవీశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్‌ ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.55.30 కోట్లు మంజురు చేసిందన్నారు. రి జర్వాయర్‌ పనులు ఎలాంటి ఆటంకాలు లే కుండా ముందుకు సాగేందుకు అటవీశాఖ అ ధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అటవీశాఖ పీసీసీఎఫ్‌ శ్రావణ్‌, ఇరిగేషన్‌ ఈఎన్‌సీ శ్రీనివాస్‌, కామారెడ్డి జిల్లా సీఈ దక్షిణామూర్తి, ఈఈ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

మాచారెడ్డి: పాల్వంచ మండలంలోని ఫరీదుపేట గ్రామ రైతులు గురువారం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రోజూ 10 గంటలు కూడా విద్యుత్‌ సరఫరా కావడం లేదన్నారు. విద్యుత్‌ సరఫరా సరిగా లేక వరి తుకాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా విద్యుత్‌ సరఫరా వరంగల్‌ నుంచి అవుతుందని తమ చేతుల్లో ఏమీ లేదని ఏఈ జ్యోతి పేర్కొన్నారు.

కామారెడ్డి క్రైం: జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఎస్సైలు బదిలీ అయ్యారు. రాజంపేట ఎస్సై మహేష్‌ను కామారెడ్డి సీసీఎస్‌కు, మాచారెడ్డి ఎస్సై అనిల్‌ను భిక్కనూరుకు, భిక్కనూరు ఎస్సైగా ఉన్న ఆంజనేయులును రాజంపేటకు, బీబీపేట ఎస్సై విజయ్‌ను మాచారెడ్డికి, బాన్సువాడ పట్టణ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నవీన్‌ చంద్రను బీబీపేటకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులను విడుదల చేశారు. బదిలీ అయిన ఎస్సైలు ఆయా పోలీస్‌ స్టేషన్‌లలో గురువారం బాధ్యతలు చేపట్టారు.

కామారెడ్డి అర్బన్‌: రాష్ట్రంలోని క్రీడా అకాడమీలు, రీజినల్‌ స్పోర్ట్స్‌ హాస్టళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈనెల 20 నుంచి 28 వరకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని యువజన, క్రీడల శాఖ జిల్లా అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రెజ్లింగ్‌, సైక్లింగ్‌, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, కబడ్డీ, జిమ్నాస్టిక్స్‌, స్విమ్మింగ్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, ఫుట్‌బాల్‌ అంశాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు ఎంపికలకు హాజరు కావాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

కామారెడ్డి టౌన్‌ : మున్సిపాలిటీలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు జరగాయని కాంగ్రెస్‌ నాయకులు, కౌన్సిలర్లు ఆరోపించారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్‌ మున్సిపల్‌ చీఫ్‌ సెక్రెటరీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌, సీడీఎంఏ డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్‌లకు ఫిర్యాదు ప్రతులను పంపినట్లు తెలిపారు. శానిటేషన్‌, వాటర్‌ వర్క్స్‌, జనరల్‌ ఫండ్‌, 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ బిల్లులపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్‌ మహేష్‌, కాంగ్రెస్‌ నాయకుడు తాటిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి: తోటి అధికారి తనను వేధిస్తున్నట్లు మండల కేంద్రంలోని జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న ఓ అధ్యాపకురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ జరిపించి నివేదిక అందించాలని జిల్లా స్థాయి అధికారులకు సూచించగా.. త్రీమెన్‌ కమిటీని ఏర్పాటు చేసి ఇరువురిని విచారించినట్లు సమాచారం. అయితే తనపై చర్యలు తీసుకోకుండా సదరు అధికారి రాష్ట్ర స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement