విషాన్ని వెదజల్లే ఫ్యాక్టరీలొద్దు
● భిక్కనూరువాసుల డిమాండ్
● ఏడో తేదీన బంద్‌కు పిలుపు
భిక్కనూరు: కెమికల్, ఫార్మా కంపెనీలతో ఇప్పటి కే ఇబ్బందిపడుతున్నామని, మరో కంపెనీ వస్తే బతకలేమని భిక్కనూరు వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య విషాన్ని వెదజల్లే ఫ్యాక్టరీలు పె ట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. భిక్కనూరులో మ రో రసాయన ఆధారిత ఫార్మా కంపెనీ ఏర్పాటు కు అడుగులు పడుతున్నాయన్న అంశంపై ‘భిక్కనూరుపై మరో పిడుగు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం మండలంలో చర్చనీయాంశమైంది. కథనాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. భిక్కనూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సోమవారం భిక్కనూరుకు వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఉన్న కెమికల్ ఫ్యా క్టరీలతో ఇబ్బంది పడుతున్నామన్నారు. భూములు కలుషితమవుతున్నాయని, దుర్వాసన భరించలేకపోతున్నామని పేర్కొన్నారు. కొందరు రాజకీయ నేతలు, అధికారులు కెమికల్ కంపెనీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. సాక్షి ది నపత్రికలో వార్త వచ్చేవరకు ప్రజాభిప్రాయ సేక రణ గురించి తమకు తెలియదన్నారు. కొత్తగా ఇ లాంటి పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తే అ డ్డుకుని తీరుతామన్నారు.
బంద్‌కు సహకరించాలి..
కంపెనీ ఏర్పాటుకోసం బుధవారం ప్రజాభిప్రా య సేకరణ చేయనున్నారు. దీనిని అడ్డుకుంటా మని మండలవాసులు అంటున్నారు. ఇందులో భాగంగా ఏడో తేదీన భిక్కనూరు బంద్‌కు పిలుపునిచ్చారు. అందరూ సహకరించాలని కోరారు.


