కాలుష్య కాసారాలు!
● దుర్వాసన వెదజల్లుతున్న పరిశ్రమలు
● మరిన్ని పరిశ్రమలొస్తే మనుగడ
ప్రశ్నార్థకమేనంటున్న ప్రజలు
కెమికల్ ఫ్యాక్టరీనుంచి దుర్వాసన వస్తుండడంతో భరించలేక ఆందోళన చేస్తున్న ప్రజలు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : భిక్కనూరు మండలంలో ని పలు గ్రామాల్లో ఏర్పాటైన పరిశ్రమల నుంచి వె లువడుతున్న విషవాయువులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముక్కుపుటాలు అదిరిపో యే వాసన భరించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భిక్కనూరు, కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, జంగంపల్లి, మల్లుపల్లి, కంచర్ల, అయ్యవారిపల్లి తదితర గ్రామాల ప్రజలు పరిశ్రమల ద్వారా వెలుబడుతున్న వాసనతో ఇబ్బందులు పడుతున్నా రు. తాజాగా భిక్కనూరు శివారులో రసాయన ఆ ధారిత ఫార్మా ఉత్పత్తుల కంపెనీ ఏర్పాటు కానుందన్న ‘సాక్షి’ కథనంతో ఆయా గ్రామాల ప్రజలు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుర్వాసన భరించలేక రోగాల పాలవుతున్నామని, మరో పరిశ్రమ ఏర్పాటు చేయడమంటే ప్రాణాలతో ఆడుకోవడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల మూలంగా ఇప్పటికే అనేక అవస్థలు పడుతున్నామని, కొత్తవి వస్తే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఈనెల 7న జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో తమ వాణి వినిపిస్తామని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు.
భరించలేని దుర్వాసనతో ఇబ్బందులు
భిక్కనూరు, సిద్దిరామేశ్వరనగర్, పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, కంచర్ల, మల్లుపల్లి తదితర గ్రామాలలో పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా ఫ్యాక్టరీల నుంచి దుర్వాసన వెలువడుతోంది. జంగంపల్లి గ్రామ శివార్లలో ఉన్న ఫ్యాక్టరీల నుంచి కూడా వాసన వస్తోంది. భిక్కనూరు మాసుపల్లి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలు, పౌల్ట్రీలతో తలమడ్ల గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి పూట అయితే ఆయా పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విషవాయువులను పీల్చడం వల్ల చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. శ్వాస సంబంధిత వ్యాధులు చాలామందిని పట్టి పీడిస్తున్నాయి. విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్న ఫ్యాక్టరీలు, విషవాయువులు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవడం లేదు. అప్పట్లో ఫ్యాక్టరీల నుంచి వదిలిన వ్యర్థాలు చెరువుల్లోకి చేరి, నీరు కలుషితం అవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. 125 రోజులపాటు నిరవధికంగా నిరసన దీక్షలు చేశారు. ఇప్పటికీ పరిశ్రమలు కొనసాగుతున్నాయని, వాటి వల్ల గాలితోపాటు నేల కూడా కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ఆందోళన పట్టని యంత్రాంగం
పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కాలుష్య నియంత్రణ విభాగం అధికారులు ఏనాడూ తమ గురించి ఆలోచించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలంటే వారికి లెక్కలేదంటున్నారు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చొరవ చూపి కాలుష్య నియంత్రణ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రేపు ప్రజాభిప్రాయ సేకరణ
భిక్కనూరు: మండల కేంద్ర శివారులోని 667 సర్వే నంబర్‌లో ఫ్యూజన్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమి టెడ్‌నకు సంబంధించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని బుధవారం ని ర్వహించనున్నట్లు తహసీల్దార్ సునీతదేవి తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ పాల్గొంటారన్నారు. ప్రజలు కార్యక్రమంలో పా ల్గొని తమ అభిప్రాయాలను తెలపాలన్నారు.


