కొత్త పుంతలు తొక్కనున్న పర్యాటకం | - | Sakshi
Sakshi News home page

కొత్త పుంతలు తొక్కనున్న పర్యాటకం

Jan 6 2026 7:34 AM | Updated on Jan 6 2026 7:34 AM

కొత్త

కొత్త పుంతలు తొక్కనున్న పర్యాటకం

కేంద్రానికి ప్రతిపాదనలు..

నిజాంసాగర్‌, నాగన్నగారి మెట్ల బావిల అభివృద్ధికి చర్యలు

కౌలాస్‌ కోట పునరుద్ధరణకు

రూ.5 కోట్లతో ప్రతిపాదనలు

అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి

జూపల్లి కృష్ణారావు

కామారెడ్డి క్రైం : రానున్న రోజుల్లో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కనుందని, జుక్కల్‌ నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మాట్లాడారు. జుక్కల్‌ నియోజకవర్గంలోని ప్రాజెక్టులు, ఆలయాలను కలుపుతూ టూరిజం హబ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఫిషరీస్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి మంత్రి జూపల్లి బదులిచ్చారు. కామారెడ్డి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం టూరిజం స్టడీ టూర్‌ చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించానన్నారు. నిజాంసాగర్‌, కౌలస్‌కోట, నాగన్నగారి మెట్ల బావి, పోచారం రిజర్వాయర్‌లను సందర్శించానన్నారు. పర్యాటకపరంగా అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

రూ.9.97 కోట్లతో ఎకోటూరిజం అభివృద్ధి..

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్‌ దర్శన్‌ 2.0 లో భాగంగా 2025లో నిజాంసాగర్‌ వద్ద ఎకోటూరిజం అభివృద్ధి ప్రాజెక్టుకు రూ.9.97 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. నిజాంసాగర్‌ సహజసిద్ధ ప్రకృతి అందాలను కాపాడుతూ పర్యావరణ అనుకూల పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడ మే దీని లక్ష్యమన్నారు. ప్రస్తుతం ఈ పనులు పురో గతిలో ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, చుట్టుపక్క ల ప్రాంతాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

పురావస్తు శాఖ పరిధిలోని చారిత్రక కౌలాస్‌ కో ట సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 13వ ఆర్థిక సంఘం ని ధులు రూ.50 లక్షల అంచనా వ్యయంతో కొన్ని సంరక్షణ పనులు చేపట్టామన్నారు. కోటను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు రూ.5 కో ట్లు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపామని సభకు తెలియజేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ల భిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

సాధ్యాసాధ్యాలపై అధ్యయనం..

చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని కౌలాస్‌ కోట, కౌలాస్‌ నాలా ప్రాజె క్ట్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌, ఇతర ప్రకృతి సిద్ధమై న ప్రదేశాలను కలుపుతూ సమగ్ర పర్యాటక స ర్క్యూట్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామ ని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వివరణాత్మక సాధ్యాసాధ్యాల అ ధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ అధ్యయనాల ఫలితాల ఆధారంగా తగిన ప్రతిపాదనలు రూ పొందించి, దశలవారీగా అమలు చేస్తామన్నా రు. జిల్లాలో సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు.

కొత్త పుంతలు తొక్కనున్న పర్యాటకం1
1/1

కొత్త పుంతలు తొక్కనున్న పర్యాటకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement