
మొక్కజొన్న పంటపై అడవి పందుల దాడి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి, చిన్నదేమి శివారులోని మొక్కజొన్న పంటలపై అడవి పందులు దాడి చేసి ధ్వంసం చేసినట్లు రైతులు తెలిపారు. సోమవారం రాత్రి తాడ్వాయికి చెందిన సుర్కంటి రాజిరెడ్డి, మిద్దె అర్జున్‌లకు సంబంధించిన మొక్కజొన్న పంటలను అడవి పందులు ధ్వంసం చేశాయి. దీంతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు కోరారు.
కామారెడ్డి క్రైం: మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జనహిత గణేశ్ మండలి 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మట్టి గణపతుల వితరణ కార్యక్రమాన్ని కలెక్టర్ చేతుల మీదుగా మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణహితమైన మట్టి వినాయకులను పూజించడం మంచి సంప్రదాయమన్నారు. జిల్లా ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దేవేందర్, టీజీవోస్ జిల్లా కార్యదర్శి సాయి రెడ్డి, టీఎన్‌జీవోస్ జిల్లా కార్యదర్శి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న పంటపై అడవి పందుల దాడి