
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
భిక్కనూరు: ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని భిక్కనూ రు ఎంఈవో రాజగంగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన అంతంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా విద్యను బోధించాలని చెప్పారు.
సామర్థ్యాలను పెంపొందించాలి
మాచారెడ్డి: ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించాలని మాచారెడ్డి ఎంఈవో దేవేందర్‌రావు అన్నారు. టీఎల్‌ఎం మేళాలో భాగంగా గురువారం ఆయన చుక్కాపూర్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన ప్రణాళిక ప్రకారం విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించాలన్నారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. కాంప్లెక్స్ హెచ్‌ఎంలు వెంకటాచారి, గోవర్ధన్‌రెడ్డి, హెచ్‌ఎం మాన్‌సింగ్ పాల్గొన్నారు.

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి