
కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఽగంట పాటు ధర్నా చేపట్టారు. తమ డిమాండ్‌లను పరిష్కరించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ.. ఆశాలకు ఆదివారం సెలవుగా ప్రకటించాలని, అధికారులు, ఏఎన్‌ఎంలు వేధింపులు మానుకోవాలన్నారు. కనీస వేతనం రూ.18వేలు, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కలెక్టరేట్‌లోని వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు.