
రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక
దోమకొండ: మండల కేంద్రంలోని గడికోటలో సోమవారం జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు దాదాపు 50 మంది వివిధ విభాగాల్లో పోటీల్లో పాల్గొన్నారు. ఈ నెల 29న హైద్రాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు పలువురు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఆర్చరీ కోచ్ ప్రతాప్‌దాస్ తెలిపారు. రికర్వు రౌండ్ జూనియర్ విభాగంలో బి. హిందు, హర్షిణి .. ఇండియన్ రౌండ్ జూనియర్ విభాగంలో ఎస్‌కే రేహన్, అకుల్, ప్రీతి, సహస్ర, ఇండియన్ రౌండ్ సబ్ జూనియర్ విభాగంలో శ్రీజ, వకులదేవి ఎంపికై నట్లు కోచ్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిర్మల్‌గౌడ్, ప్రదాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.