
రాజకీయాల్లో 45 ఏళ్ల మైలురాయి గొప్ప విషయం
భిక్కనూరు: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ రాజకీయాల్లో 45 ఏళ్ల మైల్‌రాయిని దాటడం గొప్ప విషయమని పీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం భిక్కనూరులో షబ్బీర్‌అలీని ఆయన సత్కరించి మాట్లాడారు. చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి తొలిసారిగా ఎమ్మెల్యే పదవికి పోటీచేసి గెలిచి మంత్రివర్గంలో స్థానం సాధించారన్నారు. రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసి ప్రజల మన్ననలను షబ్బీర్‌అలీ పొందారన్నారు. కామారెడ్డి పట్టణానికి మంచినీటిని తన హయాంలో అందించి అపరభగీరథుడిగా షబ్బీర్‌అలీ పేరు పొందాడని కొనియాడారు. డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గొండ్ల సిద్దరాములు, సింగిల్ విండో చైర్మన్లు గంగళ్ల భూమయ్య, నాగరాజురెడ్డి, పూల్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.