
కోతుల దాడిలో గాయపడ్డ వృద్ధుడు మృతి
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో కో తుల దాడిలో గాయపడ్డ వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన కర్రె సిద్ధయ్య (65) ను ఈ నెల 17న ఇంటి వద్ద కోతులు దాడి చేశాయి. దీంతో కిందపడిన ఆయన తుంటి ఎముక విరిగింది. వెంటనే కుటుంబీకులు ఆయనను చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సిద్ధయ్య సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు బాబు, నలుగురు కుమార్తెలు లక్ష్మి, రేణుకా అనిత, లావణ్య ఉన్నారు.