
పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
● సబ్ కలెక్టర్ కిరణ్మయి
బాన్సువాడ రూరల్: పండుగలను ప్రశాంత వాతావరణంలో సామరస్యపూర్వకంగా జరుపుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు. సోమవారం బాన్సువాడ మండల కార్యాలయంలో డీఎస్పీ విఠల్‌రెడ్డి, సీఐ అశోక్‌లతో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవిస్తూ గణేష్ చవితి పండుగతో పాటు, శోభాయాత్ర, నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. దీనికోసం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా ఉంటూ పోలీస్, రెవెన్యూ, విద్యుత్‌శాఖ అధికారులకు సహకారం అందించాలన్నారు. మండపాల వద్ద 24 గంటల పాటు ఎవరో ఒకరు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ విఠల్‌రెడ్డి హెచ్చరించారు.