
సువర్ణ శోభితం..
తెయూ ఇంజినీరింగ్ కళాశాలలో
స్పాట్ అడ్మిషన్స్
● 26, 28, 29వ తేదీల్లో కౌన్సెలింగ్
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, అడ్మిషన్స్ కన్వీనర్ టీజీఎప్‌సెట్–2025 ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ యూనివ ర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 26, 28, 29 వ తేదీల్లో అర్హులైన అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్స్ ఇవ్వనున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), కంప్యూటర్ సైన్స్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), కంప్యూ టర్ సైన్స్ (డాటా సైన్స్) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత కౌన్సెలింగ్‌లో సీట్లు అలాట్ అయినవారు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఈ డబ్ల్యూఎస్ కోటా నిబంధనలు స్పాట్ అడ్మిషన్స్‌కు వర్తించవని ప్రిన్సిపాల్ తెలిపారు. స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మే రకు ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తించదన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్ www.telanganauniversity.ac.inను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
నీలాకాశంలో ధవళ వర్ణంలో మెరిసిపోయే మేఘాలుంటాయి. వర్షించడానికి సిద్ధంగా ఉన్న కారు మబ్బులు అప్పుడప్పుడు దర్శనమిస్తాయి. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఆకాశం అరుణవర్ణంలో కనిపిస్తుంటుంది. కానీ ఆదివారం సూర్యుడు పశ్చిమ దిశలో సాగిపోతున్న సమయంలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గగన వీధుల్లో నీలి మేఘా లు సూర్య కిరణాల కలయికతో బంగారు వర్ణంలోకి మారి ఆహ్లాదాన్ని పంచాయి. కనువిందు చేసిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

సువర్ణ శోభితం..