
ఆయకట్టుకు భరోసా
● అలుగెల్లిన చెరువులు, కుంటలు
● నిండుకుండల్లా ప్రాజెక్టులు
● అన్నదాతల్లో ఆనందం
నిజాంసాగర్ : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో ప్రధాన జలాశయాలతో పాటు చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. దీంతో వానాకాలం సాగు చేస్తున్న పంటలకు భరోసా లభించినట్లయ్యింది. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు కౌలాస్, పోచారం ప్రాజెక్టులు, సింగితం రిజర్వాయర్, చెరువులు, కుంటలు, లిఫ్ట్‌లు, వ్యవసాయ బోరుబావుల కింద 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వర్షాధారంగా, ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటల కింద సాగు చేసిన పంటలకు వరుణుడి భరోసా లభించింది. ఇటీవల కురిసిన వర్షాలతో జలాశయాలు కళకళలాడుతుండడంతో ఈ సీజన్‌లో పంటలు గట్టెక్కుతాయన్న నమ్మకం రైతుల్లో పెరిగింది.
అలుగెల్లిన 780 చెరువులు, కుంటలు
జిల్లాలో 1,515 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో 780 చెరువులు వరద నీటితో అలుగెళ్లాయి. మిగతా చెరువులు, కుంటలు 50 నుంచి 70 శాతం మేర నిండాయి. ఆయా చెరువుల కింద 90 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువులు, కుంటలు ఆధారంగా సాగు చేసిన పంటలు ప్రస్తుతం ఉన్న నీటితో గట్టెక్కనున్నాయి.

ఆయకట్టుకు భరోసా

ఆయకట్టుకు భరోసా