గుప్పుమంటున్న గంజాయి | - | Sakshi
Sakshi News home page

గుప్పుమంటున్న గంజాయి

Aug 25 2025 8:22 AM | Updated on Aug 25 2025 8:22 AM

గుప్పుమంటున్న గంజాయి

గుప్పుమంటున్న గంజాయి

గుప్పుమంటున్న గంజాయి

బాన్సువాడ: గంజాయి విక్రయాలకు బాన్సువాడ కేరాఫ్‌గా మారింది. రెండు రాష్ట్రాల సరిహద్దులకు దగ్గరగా ఉన్న బాన్సువాడలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తీసుకొచ్చి విక్రయాలు సాగిస్తున్నారు. బాన్సువాడ ప్రాంతంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా ఎకై ్సజ్‌ శాఖ అధికారులు అటువైపు దృష్టి సారించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి బాన్సువాడలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రోజువారీ పనులు చేసుకునే యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి దందా సాగిస్తున్నారు. తాజాగా బాన్సువాడ సమీపంలోని బీర్కూర్‌ చౌరస్తా వద్ద 300 గ్రాముల గంజాయిని తీసుకెళ్తున్న వ్యక్తిని ఎకై ్సజ్‌ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ నెలలోనే బాన్సువాడలో 575 గ్రాముల గంజాయిని పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గ్రాముకు రూ.500 చొప్పున విక్రయం..

బాన్సువాడలో యువత, కార్మికులను టార్గెట్‌ చేసుకొని గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా టీ పాయింట్లు, ఖాళీ ప్రదేశాలు, గ్రామ శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకొని గంజాయి దందా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సంగమేశ్వర కాలనీ, గౌలీగూడ తదితర కాలనీల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం. అయితే గంజాయికి అలవాటుపడిన వారిలో అధికంగా యువత ఉండడం, అందులోనూ వివిధ పనులు చేస్తూ కార్మికులుగా జీవనం సాగిస్తున్న వారే ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. రోజువారీగా కూలి పనులు చేసుకునే వారు సైతం గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు. మరో వైపు గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన వారిలో యువతే ఉండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. బాన్సువాడలో మత్తు పదార్థాలకు బానిసగా మారిన యువకులు పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. నిఘా పెట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరేత్తనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సమాచారం ఇస్తే తప్ప అటు వైపు దృష్టి సారించకపోవడం గమనర్హం.

ఇటీవల పట్టుకున్న ఘటనలు..

● ఈ నెల 6న బాన్సువాడ పట్టణంలో ఓ హోటల్‌ సమీపంలో దాసరి పోశెట్టి అనే వ్యక్తిని గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 275 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

● ఈ నెల 23న బాన్సువాడ సమీపంలో బీర్కూర్‌ చౌరస్తా వద్ద గంజాయి తీసుకొస్తున్న దెగ్లూర్‌కు చెందిన అర్జున్‌ అనే వ్యక్తిని ఎకై ్సజ్‌ శాఖ అధికారులు పట్టుకుని 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై బాన్సువాడ ఎకై ్సజ్‌ సీఐ దిలిప్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.

బాన్సువాడలో విచ్చలవిడిగా విక్రయాలు

రోజువారీ కూలి పనులు చేసుకునే

యువతే లక్ష్యంగా దందా

టీ పాయింట్లు, శివారు ప్రాంతాలే అడ్డా..

నెల రోజుల్లో 575 గ్రాముల

గంజాయి పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement