జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

Aug 25 2025 8:22 AM | Updated on Aug 25 2025 8:32 AM

కామారెడ్డి అర్బన్‌ : జిల్లా వాలీబాల్‌ అసోసి యేషన్‌ సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎస్‌ఆర్‌కే డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఇందులో జిల్లా కార్యవర్గా న్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జె.రవీంద ర్‌, కార్యదర్శిగా పి.బాలయ్య, కోశాధికారిగా కె.సురేందర్‌, ఉపాధ్యక్షులుగా ఎ.దత్తాత్రి, ఎ.అనంతరావు, ఎం.స్వామి, సంయక్త కా ర్యదర్శులుగా కె.ఈశ్వర్‌కుమార్‌, డి.ప్రదీప్‌ దేశ్‌పాండే, నరేష్‌కుమార్‌, కార్యవర్గసభ్యులు గా జె.ప్రభులింగం, ఆర్‌.రవీందర్‌గౌడ్‌, మ ణికంఠ పటేల్‌, బాబాగౌడ్‌, పండరి గౌడ్‌, ప్రి యాంక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలంగాణ వాలీబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మైలారం శ్రీనివాస్‌ తెలిపారు.

‘ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’

నాగిరెడ్డిపేట: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సంఘ్‌ ఇందూరు విభాగ్‌ ప్రచార ప్రముఖ్‌ డాక్టర్‌ వారె దస్తగిరి పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం నాగిరెడ్డిపేట మండలకేంద్రం గోపాల్‌పేటలోని శ్రీ కోదండ రామాలయం కళ్యాణ మండపంలో స్వయం సేవకుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్‌ పంచసూత్రాలైన పర్యావరణం, సామాజిక సామరస్యం, స్వబోధ, పౌరమర్యాదలు, కుటుంబ జ్ఞానోదయం అంశాలపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు సంతోష్‌రెడ్డి, ప్రసాద్‌, భూపతి రాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌

రవీంద్రమోహన్‌కు అవార్డు

ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ రవీంద్రమోహన్‌ మోస్ట్‌ కాంపాజినేట్‌ సర్జన్‌ అవార్డును అందుకున్నారు. అత్యధిక సర్జరీలు చేసినందుకు ఆయనను ఈ అవార్డు వరించిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన వరల్డ్‌ ఐకాన్‌ అవార్డుల కార్యక్రమంలో ఆయన బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారని పేర్కొన్నారు. ఆయనకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

ఉమ్మడి జిల్లాకు రెండు సీవోఈ

మైనారిటీ కళాశాలలు

కామారెడ్డి అర్బన్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు మైనారిటీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్‌) ఆధ్వర్యంలో రెండు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ) కళాశాలలు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని టెమ్రిస్‌ ఉ మ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి బషీర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నిజామా బా ద్‌లోని నాగారం (బాలుర), ధర్మపురి హిల్స్‌ (బాలికల)లలో ఏర్పాటు చేసిన సీవోఈ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా మైనారిటీ కేటగిరీకి చెందిన ముస్లింలు, క్రిస్టియ న్లు, పార్సీలు, జైనులు, సిక్కులతోపాటు నాన్‌ మైనారిటీ కోటా కింద అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు మైనారిటీ గురుకులాల ప్రి న్సిపాల్‌ సయ్యద్‌ హైదర్‌(89857 83112), ఆయేషా (85550 30851), ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రాంతీయ సమన్వయ అ ధికారి బషీర్‌ (98494 19469)ను సంప్రదించాలని సూచించారు.

డైట్‌లో స్పాట్‌ అడ్మిషన్లు

కామారెడ్డి అర్బన్‌: డైట్‌లో మిగిలిపోయిన సీ ట్లకు రెండో విడత స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు నిజామాబాద్‌ డైట్‌ ప్రిన్సిప ల్‌ టి.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ని జామాబాద్‌ కళాశాలలో ఈనెల 26న, ప్ర యివేట్‌ కళాశాలల్లో 28న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అర్హత పరీక్ష మెరిట్‌, రిజర్వేషన్‌ల ప్రకారం భర్తీ ఉంటుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం ఉండదని తెలిపారు.

జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌  కార్యవర్గం ఎన్నిక 
1
1/1

జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement