కామారెడ్డి టౌన్: జమిలి ఎన్నికలతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక (జమిలి ఎన్నిక)లపై కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన ఒకే దేశం ఒకే ఎన్నిక బీజేపీ దృక్కోణం అంశంపై నిర్వహించిన వర్క్ షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఆరోపించారు. ఆర్థికంగా తీవ్ర భారం తగ్గుతుందన్నారు. దేశంలో జమిలి ఎన్నికల కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని ఇందుకోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల స్థాయిలో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్ గౌడ్, రంజిత్ మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, నాయకులు లింగరావు, వేణు, శ్రీనివాస్, లక్ష్మి నారాయణ, భరత్, నరేందర్, రమేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
యెండల లక్ష్మీనారాయణ