TS Kamareddy District Crime News: బైక్ పై వెళ్తు ఆగి ఉన్న లారీని ఢీకొన్న యువకుడు..
Sakshi News home page

బైక్ పై వెళ్తు ఆగి ఉన్న లారీని ఢీకొన్న యువకుడు..

Oct 13 2023 1:02 AM | Updated on Oct 13 2023 10:25 AM

- - Sakshi

కామారెడ్డి: ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి శివారులో విశ్వ ఆగ్రోటెక్‌ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రయాన్‌పల్లికి చెందిన అనిల్‌(33) మృతి చెందినట్లు డిచ్‌పల్లి ఎస్సై మహేశ్‌ తెలిపారు. వివరాలు.. అనిల్‌ బుధవారం సాయంత్రం డిచ్‌పల్లి మండలం రాంపూర్‌ గ్రామానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాదు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య నవనీత ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కారు ఢీకొని ఒకరు..
 
కారు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మున్సిపల్‌ పరిధిలోని టేక్రియాల్‌ బైపాస్‌ సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిపినగండ్ల గ్రామానికి చెందిన దూదెకుల బాబు (55) సెంట్రింగ్‌ పనుల నిమిత్తం కామారెడ్డికి వచ్చాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో టేక్రియాల్‌ సమీపంలో నడుచుకుంటు వెళ్తుండగా నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి అతడిని వెనక నుంచి ఢీకొంది.

ఈ ప్రమాదంలో బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. మృతుడి తమ్ముని కుమారుడు సలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement