వ్యసన రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

వ్యసన రహిత సమాజమే లక్ష్యం

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

కామారెడ్డి అర్బన్‌: నషా ముక్త్‌ భారత్‌ ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కనీసం ఐదుగురిని మత్తుకు దూరంగా ఉండేలా చైతన్యం చేయాలని ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కామారెడ్డి ఇన్‌చార్జి జయదీది అన్నారు. మిషన్‌ స్పందన్‌ జాతీయ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరపున గురువారం కామారెడ్డి జెడ్పీహెచ్‌ఎస్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ప్రతిజ్ఞ చేయించడంతో పాటు అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి వెంకట్‌, బ్రహ్మకుమారీలు అనిల్‌, మీనాక్షి, సుజాత, సమత, జిల్లా సైన్స్‌ అధికారి సిద్ధిరాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

భిక్కనూరులో..

భిక్కనూరు: వ్యసన రహిత సమాజ నిర్మాణమే ప్రజాపిత బ్రహ్మకుమారీ సంస్థ (ఓంశాంతి) లక్ష్యమని బ్రహ్మకుమారీలు జయదీది, గంగాలతలు అన్నారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాల, కళాశాలలో వ్యసనాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. వ్యసనరహిత సమాజం సర్టిఫికెట్లను పాఠశాలలకు అందజేశారు. ప్రిన్సిపాల్‌ రఘు, ఓంశాంతి ప్రతినిధులు శనిశెట్టి రాజలింగం, గుంటుకు రాజు,కొడిప్యాక అంజనేయులు, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement